ఉరవకొండ: పట్టణంలో ఈ నెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యక్రమం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో ఈ నెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టే పరిచయ ఉద్యమ కార్యక్రమాన్ని దద్దరిల్లి విధంగా చేపడదామని నియోజకవర్గ వైయస్సార్సీపి సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈనెల 12న నిర్వహించే వైయస్సార్సీపి ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి పార్టీ సమన్వయకర్త ఆవిష్కరించారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ నాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నరు.