ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ గ్రామంలో: నంద్యాల మాజీ ఎంపీ ఇంటి ఆవరణ భారీ శబ్దంతో పిడుగు
నంద్యాల జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో మోస్తారు వర్షం కురిసింది, ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఉయ్యాలవాడలో నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వగృహం ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది, కొబ్బరి చెట్టు పైన మంటలు ఎగసిపడ్డాయి, చుట్టు ప్రక్కల వారు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు, పిడుగు పడిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు