అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్న ఏ ఎస్ పి అశ్విని కుమార్
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం నగరంలోని రఘువీరా టవర్స్ సమీపంలో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తన వాహనంలో చేర్చి మానవత్వాన్ని అనంతపురం ఏఎస్పీ అశ్విని కుమార్ చాటుకున్నారు. ఈ సందర్భంగా అతనికి మెరువైన వైద్య సేవలను అందించాలని సిబ్బందిని కోరారు. బాధితుడు నగరంలోని 5వ రోడ్డుకు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అతనికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.