పాలకుర్తి: జనగామ జిల్లా: గుండెపోటుతో 29 ఏళ్ల యువకుడు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో విషాదం. నిద్రలోనే గుండెపోటు రావడంతో 29 ఏళ్ల నాయిని నరేష్ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేష్ మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.