తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికురాలి పర్సు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
Tiruvuru, NTR | Sep 20, 2025 తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓ ప్రయాణికురాలి పర్సు చోరీకి గురైంది. భద్రాచలానికి చెందిన ఎడవల్లి మరియమ్మ విజయవాడ వెళ్లే క్రమంలో తిరువూరులో బస్సు దిగింది. మరో బస్సు ఎక్కి చూసుకుంటే పర్సు పోయినట్లుగా గుర్తించి లబోదిబోమంది. పర్సులో 90 వేల రూపాయల నగదు, 50 వేల రూపాయల చెక్కు ఉన్నట్లు వెల్లడించింది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.