బాటిళ్లను స్కాన్ చేసి అమ్మకాలు జరపాలి : సీఐ రమేష్ బాబు
నెల్లూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ లో బార్లు మరియు మద్యం షాపుల యజమానులతో సీఐ రమేష్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మద్యం అమ్మకాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా “A.P. Excise Suraksha” యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేసి అమ్మకాలు జరపాలన్నారు. స్కాన్ చేయకుండా బాటిళ్లను విక్రయించడం పూర్తిగా నిషేదించామన్నారు. అలాగే, బెల్ట్ షాపులు నిర్వహిస్తే లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం అయన హెచ్చరించారు.