బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్లకి పల్లకి సేవ
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఆలయ ఈవో డి. పాండురంగారెడ్డి, ఆలయ ఛైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా పల్లకిసేవ నిర్వహించారు. సాయంత్రం ఆలయ వేదపండితులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.