భువనగిరి: చౌటుప్పల్, నారాయణపూర్ మండల కేంద్రాలలో రెండు గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్, నారాయణపూర్ మండల కేంద్రాలలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా గత రెండు గంటల నుండి భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీగా వర్షం కురుస్తుండడంతో వర్షపు నీటికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది.