సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన యువకుడు ఒంగోలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్య
నాగులుప్పలపాడు: ఒంగోలులోని ఓ లాడ్జిలో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మను బ్రోలు గ్రామానికి చెందిన కట్టా త్రినాధ్ (30) అనే యువకుడు ఒంగోలులోని ట్రంకు రోడ్డులో గల ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావలసి ఉంది.