సిరిసిల్ల: బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు
బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి గారు చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ గారు తెలిపినారు.