గుంతకల్లు: కసాపురం పీఎస్ పరిధిలో చోరీలకు పాల్పడిన బైక్ దొంగ అరెస్ట్, నాలుగు బైకులు స్వాధీనం, సీఐ ప్రవీణ్ కుమార్
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని బుగ్గ సంగాల గ్రామ శివారులో ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడిన దొంగను కసాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కసాపురం, గుంతకల్లు లో బైక్ లు చోరీ కావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే బుగ్గ సంగాల దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పింజరి షేక్షావలి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి నాలుగు పల్సర్ బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.