రాజమండ్రి సిటీ: ఐ ఎల్ టి డి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలు
రాజమండ్రిలోని ఐ ఎల్ టి డి జంక్షన్ పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఐ ఎల్ టి డి జంక్షన్ వైపు స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.