మహానంది క్షేత్రంలో నిజాయితీ చాటుకున్న హోంగార్డు నాయక్
మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చిన హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్, కుటుంబ సభ్యులు మర్చిపోయిన మనీ పర్సును హోంగార్డు నాయక్ ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో భక్తులకు అందిచారు.పెద్దకోనేరు వద్ద వారు పర్సును మర్చిపోయారు. పర్సులో ఒక ఐఫోన్ తో పాటు రెండు మొబైల్స్, రూ. 10,000 నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన హోంగార్డు నాయక్ ఏఈఓ ఎరమల మధుకు సమాచారం అందించి ఆయన ఆధ్వర్యంలో భక్తులకు అందించారు. హోంగార్డు నాయక్ ను ఏఈఓ ఎరమల మధు అభినందించారు.