భిక్కనూర్: జంగంపల్లి సింగిల్ విండో సొసైటీ కార్యాలయానికి యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
బిక్కనూరు మండలం జంగంపల్లి సింగిల్ విండో సొసైటీ కార్యాలయానికి మంగళవారం యూరియా బస్తాలు చేరుకోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పంపిణీలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా సొసైటీ సిబ్బంది ముందస్తుగా టోకెన్లు జారీ చేశారు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సరఫరా ప్రక్రియ సాఫీగా సాగుతోంది. టోకెన్లు లభించని రైతులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ల ప్రకారం ప్రతి రైతుకు యూరియా అందజేయడం జరుగుతుందని సిబ్బంది తెలిపారు.