ఆళ్లగడ్డ: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గురువారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు