పలమనేరు: బైరెడ్డిపల్లి: దుముకురాళ్ళ జలపాతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అమర్, టూరిజం స్పాట్ గా కైగల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు
బైరెడ్డిపల్లి: మండలంలోని కైగల్ జలాశయ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కలిసి ఆయన కైగల్ దుముకురాళ్ళ జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జలాశయంలో ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిని ఆయన పరిశీలించారు. జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కొంతసేపు గడిపారు. అనంతరం స్థానిక రెవిన్యూ అధికారులతో కలిసి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంత మేర ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.