ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలులో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ ఒక బాధితురాలు ఆవేదన
Ongole Urban, Prakasam | Jun 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ ఒక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా తాము పాపా కాలనీ ఫస్ట్ లైన్‌లో నివాసం ఉంటున్నామని, తమ అప్పు మొత్తం తీరిపోయినప్పటికీ కొందరు వ్యక్తులు ఇల్లు ఖాళీ చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు విజయలక్ష్మి ఆరోపించారు. తమపై, తమ పిల్లలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఇంట్లో నుండి బయటకు లాగి కొట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఆమె తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు