రేపు పాడేరులో వైయస్సార్సీపీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశం-అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
ఈ నెల 31 వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశంను పాడేరులో నిర్వహిస్తున్నట్లు అరకులోయ శాసనసబ్యుడు రేగం మత్స్యలింగం ఒక ప్రకటనలో కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు అద్యక్షతన ఈ నెల 31 శనివారం పాడేరు మండలం లోచలిపుట్టు లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహిస్తామని, జిల్లా నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని అందుచేత అరకులోయ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు,మండల అద్యక్షులు, సర్పంచిలు,ఎంపీటీసీలు, జిల్లా మండల స్థాయి నాయకులు హాజరుకావాలని సూచించారు.