గుంతకల్లు: గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామంలో వర్షాలకు తడిచిన వేరుశనగ పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలలోని ఊబిచర్ల గ్రామంలో అకాల వర్షాలకు తడిచిన వేరుశనగ పంటలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. మంగళవారం గ్రామ శివారులో పంట పొలాలను వారు పరిశీలించి రైతులను విచారించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి.నిర్మల మాట్లాడుతూ జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోతున్నారని అన్నరు. పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.