కనిగిరి: భారత్ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాల విధించడం దారుణం: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు
హనుమంతునిపాడులో భారత్ ఎగుమతుల పై అమెరికా సుంకాలను నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమెరికా అధ్యక్షులు ట్రంప్ చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... భారతదేశ ఎగుమత్తులపై అమెరికా 50% సుంకాలు విధించడం దారుణం అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్య అన్నారు. భారత్ అమెరికా చర్యలను గట్టిగా తిప్పి కొట్టాలని డిమాండ్ చేశారు.