జగిత్యాల: పట్టణంలోని హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమాన్ చాలీసా బృందం చే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
జగిత్యాల జులై 6 జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయము లో హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలచే దీపాలంకరణ చేశారు. అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అంతకముందు సంఘనపట్ల నరేందర్ శర్మచే సంకల్పం నిర్వహించి వైదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవన్నామస్మరణతో ఆలయమంతా మారు మోగింది. కార్యక్రమానంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు.