రాజమండ్రి సిటీ: 12వ పిఆర్సి జీతాలు చెల్లించాలని కొవ్వూరులో మున్సిపల్ కార్మికుల ర్యాలీ
మున్సిపల్ కార్మికులందరికీ 12వ పిఆర్సి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కొవ్వూరు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులు విజయ విహార్ సెంటర్ మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మె కాలపు వేతన ఒప్పందాలను అమలు చేయాలని కోరారు.