నంద్యాల అర్బన్: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ :నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 28, 2026
నంద్యాలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.