కొత్తగూడెం: యూరియా కోసం వచ్చిన ఆకలితో అలమటిస్తున్న రైతన్నలకు అన్నదానం చేసిన పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కంపెల్లి కనకేష్
గత 45 రోజులుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పాల్వంచ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఉదయం ఆరు గంటల నుంచే సొసైటీ కార్యాలయాల వద్ద క్యూ లైన్లలో నిలబడి అర్ధరాత్రి వరకు ఎదురుచూస్తున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిని గమనించిన పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ రైతులకు అండగా నిలిచారు.యూరియా కోసం వచ్చి ఆకలితో అలమటిస్తున్న సుమారు 200 మందికి పైగా రైతులకు సొసైటీ కార్యాలయం వద్ద సోమవారం అన్నదానం ఏర్పాటు చేశారు.