కుటుంబ ఆస్తి వివాదం… అధికారాన్ని అడ్డంపెట్టుకున్న పాలఏకరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరనాయుడు!
పాలఏకరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరనాయుడు కుటుంబంలో ఆస్తి వివాదం తీవ్రరూపం దాల్చింది. సంబేపల్లి సర్వే నం.48/2లో ఉన్న 20 సెంట్ల స్థలం, రైస్ మిల్ యాజమాన్యంపై నాగేశ్వరనాయుడు – రామచంద్ర నాయుడు సోదరుల మధ్య తగాదా కొనసాగుతోంది. ఆర్డీవో విచారణలో నకిలీ పాస్‌బుక్ రద్దు అయినప్పటికీ, నాగేశ్వరనాయుడు తన అధికారాన్ని ఉపయోగించి రైస్ మిల్ యంత్రాలను ₹50 లక్షల విలువకు విక్రయించాడని రామచంద్ర నాయుడు కుమారుడు ఉమామహేశ్వర్ నాయుడు మీడియాకు తెలిపారు. కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన అధికారులు కోరారు.