హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమత్తులు చేయాలని ఆదేశించారు.. చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్కడ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ హుస్నాబాద్ లో ఘనంగా జరుపుకోవాలని అందుకు సంబంధించి ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు నిండుగా ఉండడంతో కట్ట లోపలికి భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, లైటింగ్ ,స్టేజి , సౌండ్ అనౌన