గుంతకల్లు: గుత్తి లోని వక్కల కుంటలో వేలాది చేపలు మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టిన మత్స్యశాఖ అధికారులు
గుత్తిలోని శివాలయం సమీపంలో ఉన్న వక్కల కుంటలో గురువారం వేలాది చేపలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. చేపలు ఎలా మృతి చెందాయో తెలియడం లేదు. ఎవరైనా విష ప్రయోగం చేశారా లేక వైరస్ వల్ల మృతి చెందాయో తెలియడం లేదు. మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మత్స్యశాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. స్థానికులను విచారించారు.