నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, నేలకొరిగిన వృక్షాలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది,సాయిబాబా పేటలోని ప్రధాన రహదారిలో చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, డ్రైనేజ్ కాలువలు పొంగి రోడ్లపైకి మురికి నీరు ప్రవహించింది,ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ కరెంట్ వైర్లు తెగిపోవడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి కరెంటును పునరుద్ధరించారు,ఎండ వేడి మి తో ఇబ్బందులు పడిన ప్రజలకు రాత్రి కురిసిన వర్షంతో ఒక్కసారిగా చల్లటి గాలులతో వాతావరణం మారడంతో ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు.