నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో ఆవులమందపై పెద్దపులి దాడి
Nandyal Urban, Nandyal | May 19, 2026
ఆవులమందపై పెద్దపులి దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వెలుగోడు మండల పరిధిలోని గట్టు తాండ వద్ద ఆవుల మండపై ఓ పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో రెడ్యా నాయక్ కు చెందిన ఆవు మృతి చెందింది. ఆవులమందపై పెద్దపులి దాడి చేసే సమయంలో ఆవుల అరుపులు విని ఒక్కసారిగా కాపర్లు కేకలు వేయడంతో పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెద్దపులి వెళ్ళిపోయే దృశ్యాలను ఆవుల కాపరులు తమ సెల్ఫోన్లో బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.