నంద్యాల అర్బన్: జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటమొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి : వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్
Nandyal Urban, Nandyal | May 23, 2026
నంద్యాల జిల్లాలో రైతుల పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని సెంట్రల్ వేర్ హౌస్ వద్ద జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి వైసిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి రైతుకు న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు