కావలి: కావలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ధర్నా..
కావలి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట స్టాంపు వెండర్స్, డాక్యుమెంట్ రైటర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ 2.0 విధానాన్ని వ్య తిరేకించారు. 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆస్తిని కొనేవారు, అమ్మేవారు ఇద్దరూ ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుందన్నారు. కానీ కొన్ని సందర్భాలలో ఓటీపీ రాకపోతే రిజిస్ట్రేషన్ ఆగిపోతుందన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.