సూర్యాపేట: 'పాపను నేలకేసి కొట్టి చంపాడు': సూర్యాపేటలో చిన్నారి తల్లి నాగమణి
భార్యభర్తల మధ్య గొడవ కారణంగా ఏడాది వయసున్న పాపను తండ్రి చంపిన సంగతి తెలిసిందే. 'నా భర్త రాత్రి తాగి వచ్చి గొడవపడ్డాడు. పాప ఏడుస్తుండడంతో నేలకేసి కొట్టాడు. పాప స్పృహ తప్పిపోయింది. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దు' అని కన్నీటి పర్యంతమైంది.