నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె వద్ద నూతన పట్టాభిరామ ఆలయ ప్రతిష్ఠ ముగింపు పూజలు సోమవారం వైభవంగా నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు ఇటిక్యాల బాల్రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఈ ఉత్సవాలు సాగాయి. ఏకశిలపై పట్టాభిరామ, లక్ష్మణ సహా 11 మంది పరివారంతో ఉన్న విగ్రహాలు చాలా అరుదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.