నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పట్టణానికి చేరుకుంది. ఈ విగ్రహాన్ని క్రేన్ సాయంతో దిమ్మపై చేర్చారు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. శనివారం ఉదయం 8 గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని, కేంద్ర మంత్రులు కూటమి నేతలు, హాజరవుతారని తెలుపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.