ములుగు: జిల్లా కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 17, 2025 ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నేడు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మంత్రి అన్నారు. గర్భిణి స్త్రీ లు, బాలింతలు, చిన్న పిల్లలు ఆరోగ్యం కోసం పోషణతో కూడిన ఆహారం తీసుకోవాలని అన్నారు. అనంతరం ఫోటో గ్యాలరీనీ పరిశీలించారు.