మక్కువ మండలం గుంటభద్ర గ్రామంలో ప్రకృతి వ్యవసాయ నవధాన్యాలు సాగుపై అవగాహన ర్యాలీ నిర్వహించిన రైతులు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ గుంటభద్ర గ్రామంలో జిల్లా ఉద్యన అధికారి డి. శ్యామల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పీఎండీఎస్ నవధాన్యాలు అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. ముందుగా సమావేశం పెట్టి, జిల్లా ఉద్యనశాఖ అధికారి డి. శ్యామల మాట్లాడుతూ ఒకే పంట కాకుండా ప్రధాన పంటలో అంతర పంటలు వేసుకోవాలని, జీడిమామిడిలో పసుపు, అల్లం, పైన్ ఆపిల్ అంతర పంటలగా వేసుకుంటే అదనంగా ఆదాయం వస్తుందన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ఎటువంటి రసాయన పురుగులు మందులు వాడకుండా కషాయాలు, ద్రావణాలు వాడాలన్నారు. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున తదితరులు పాల్గొన్నారు.