అనంతపురం నగర శివారులోని తమ భూమిని టిడిపి నాయకుడు కబ్జా చేశారు : బాధితురాలు అనసూయ మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Oct 7, 2025
అనంతపురం నగర శివారులోని నారాయణపురం పంచాయతీ పరిధిలో ఉన్న తమ భూమిని టిడిపి నాయకుడు ముకుంద నాయుడు కబ్జా చేశారని అనంతపురం నగరానికి చెందిన అనసూయ అనే బాధితురాలు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.