బాధితుల సమస్యలు చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలి: విజయనగరం లో అదనపు ఎస్పీ సౌమ్య లత ఆదేశాలు
Vizianagaram Urban, Vizianagaram | Sep 15, 2025
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ సౌమ్యలత నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి 32 ఫిర్యాదులను అదనపు ఎస్పీ సౌమ్య లత స్వీకరించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ సౌమ్య లత ఆదేశించారు. ఎస్బిసిఐ ఏవి లీలారావు, డిసిఆర్పిసిఐ ఏ సుధాకర్,ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.