ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుందాం. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్
Ongole Urban, Prakasam | Nov 1, 2025
దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కర్నూల్ రోడ్ కూడలి వద్ద ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం వరకు నిర్వహించారు. విధినిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం పోలీసులు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద అమరవీరుల మహోన్నతమైన త్యాగాలు స్మరించుకుంటూ అద్భుతమైన బ్యాండ్ షో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.