రాయదుర్గం: పట్టణంలో SRJ బస్సు డీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎర్రల్లి నాగరాజు చికిత్స పొందుతూ మృతి
రాయదుర్గం పట్టణంలో SRJ ప్రైవేట్ బస్సు డీకొన్న ఘటనలో చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడిన ఎర్రల్లి నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణానికి చెందిన ఓబుళేసు, నాగరాజులను ఈనెల 18 న SRJ బస్సు డీకొనింది. వారిద్దరు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఓబుళేసు అదేరోజు చనిపోగా నాగరాజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి బార్య నలుగురు సంతానం ఉన్నారు.