పుంగనూరు: దళితుల సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ కాళ్లు పట్టుకున్న ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజు
చిత్తూరు జిల్లా పుంగనూరు తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రాము అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్న ఒక గంట ప్రాంతంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ దళితులకు కేటాయించిన స్మశాన వాటికలో చెరువుల వద్ద ఏర్పాటు చేశారని. స్మశానాల్లో వర్షపునీరు చేరడంతో మృతదేహాలను అంతక్రియలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ రాము కాళ్లు పట్టుకొని సమస్యలు పరిష్కరించాలని వేడుకున్న ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజు,