దర్శి: స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని పెద్దవరం ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన
Darsi, Prakasam | Sep 16, 2025 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మార్వో కార్యాలయం నందు నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మార్వో రజిని కుమారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు రామయ్య మాదిగ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా స్మశాన వాటిక లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పూడ్చి కాలం గడుపుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.