వనపర్తి: పెద్దమందడి:మహిళా ప్రోత్సాహకాలతో దేశ ఆర్థిక పురోగతి సాధ్యం...ఉద్యాన కళాశాల అసోసియేట్ డాక్టర్ పిడిగం సైదయ్య
మహిళా ప్రోత్సాహకాలతో దేశ ఆర్థిక పురోగతి సాధ్యమని పెద్దమందడి మండల పరిధిలోని మోజెర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డాక్టర్ పిడిగం సైదయ్య అన్నారు. శుక్రవారం మోజర్లలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం,ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో మహిళల దినోత్సవ వేడుకలు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు. మహిళా పై పెట్టుబడి పురోగతిని వేగవంతం చేస్తుందని "ఇన్స్ పైర్ ఇన్క్లూషన్ " అనే అంశాలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీన్ మాట్లాడుతూ దేశ ప్రగతి, మహిళా సాధికారత మీద ఆధారపడి ఉందని, మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సును ఊహించలేమని అన్నారు.