జమ్మలమడుగు: కమలాపురం : మాటల గారిడితో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు - వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గురువారం కడప వైసిపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలన మొత్తం అవినీతి అక్రమాలే అన్నారు.అన్ని రంగాల్లో అవినీతి చేయడమే లక్ష్యంగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎరువులు,యూరియా అందక రైతులు నష్టపోతున్నారన్నారని తెలిపారు.రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి కనబడలేదా అంటూ ప్రశ్నించారు.మాటల గారిడితో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని తెలిపారు.మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.