కళ్యాణదుర్గం: గత వైసీపీ ప్రభుత్వమే జే బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయించింది: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
గత వైసీపీ ప్రభుత్వమే జే బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయించిందని కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపించారు. కళ్యాణదుర్గం లో గురువారం మధ్యాహ్నం 1. 30 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వం జే బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయించి కోట్లాది రూపాయలు దోచుకుందన్నారు.తాము నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తున్నామన్నారు.మద్యం విక్రయాల్లో డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు.ఎవరికైనా డౌట్ ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చన్నారు. స్కాన్ చేశాక నకిలీనా ?ఒరిజినలా? తెలుస్తుందన్నారు.