జమ్మలమడుగు: అట్లూరు : మండలంలోని వేములూరు బ్రిడ్జి పైకి చేరిన సోమశిల వరద ప్రవాహం...
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అట్లూరు మండలంలోని వేములూరు బ్రిడ్జి పైకి సోమశిల వరద ప్రవాహం చేరినట్లు సోమవారం స్థానికులు తెలిపారు. బ్రిడ్జి పైకి నీరు చేరడంతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పలు గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.నడుము లోతు నీటిలో ప్రమాదకరంగా పలు గ్రామాల ప్రజలు బ్రిడ్జి దాటుతున్నారు.పలు గ్రామాలకు వెళ్లాలంటే 35 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు తెలుపుతున్నారు.