కుప్పం: ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో చేపడుతున్న రక్త పరీక్షల శిబిరంలో ప్రతి ఒక్కరు రక్తపరీక్షలు చేయించుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం పట్టణంలో జరుగుతున్న రక్త పరీక్షలు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించడం జరుగుతుంది ఒక్కసారి రక్తపరీక్ష చేయించుకుంటే 49 రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.