మేడ్చల్: బాలాజీ నగర్ ప్రధాన రహదారిలో చెత్త లారీలు రాకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ కి బిజెపి నాయకుల ఫిర్యాదు
జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రధాన రహదారి గుండా డంపింగ్ యార్డ్ కు వెళ్లే చెత్త లారీలు రాకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ కి బిజెపి, బీజేవైఎం నాయకులు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆర్.వి కర్ణన్ వెంటనే అదనపు కమిషనర్ సిఎన్ .రఘు ప్రసాద్ కి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.