జమ్మలమడుగు: కమలాపురం : నగర పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా 2025 థీమ్ మౌనవహారం
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం "స్వచ్ఛతా హీ సేవా 2025 థీమ్" మౌనవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ మాట్లాడుతూ స్వచ్ఛోత్సవ్ అనే ఇతివృత్తంతో నిర్వహించే "స్వచ్ఛతా హీ సేవా 2025 అనేది "బాధ్యతతో కూడిన వేడుకల సమ్మేళనమన్నారు.పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన మరియు పచ్చదనం కోసం దేశం యొక్క సంకల్పాన్ని ప్రదర్శించడానికి,దేశవ్యాప్తంగా శ్రమ దానంలో పౌరులు పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు