పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణము ఉండాలి
: ఉపాధ్యాయులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి
ఐటీడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, ఇంచార్జి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్ది పేర్కొన్నారు. ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని, మౌలిక వసతుల లోటు ఉండరాదని అన్నారు. పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను మంగళ వారం జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టీని పరిశీలించిన ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్లు, కిచెన్ షెడ్, టాయిలెట్లు,పారిశుధ్యం,డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, పాఠశాల పరిశుభ్రంగా ఉండాలన్నారు.